Friday, July 25, 2014

మొక్కల పెంపకం

మేజర్ "సేంద్రీయ కాంత్" కి మొక్కల పెంపకం అంటే ప్రాణం !!
రొజూ భార్యా భర్తలు ,బాల్కనీ లో నించుని మొక్కలు చూసి ఆనన్దిస్తూ వుంటారు!!
"ఏమండీ!! మనం తొందరలోనే ఒక దిష్టి బొమ్మ కొని పెట్టాలండీ!!" అంది "లిల్లీ కుమారి"!
"ఎం? ఇప్పుడు ఏమయింది...పని జరుగు తోంది గా !!" అన్నాడు మేజర్ "సేంద్రీయ కాంత్" !
" అవునను కొండీ!! ...కానీ, మా అమ్మ, రొజూ చేతులు చాపి అలా గంటల కొద్దీ నించుంటే ,కాళ్లూ చెతులూ ఒకటే నొప్పి అంటొన్దండీ,పాపం!!" అంది "లిల్లీ కుమారి"!

Monday, July 21, 2014

తీసుకోండి!



                                        తీసుకోండి!
"సార్! వృద్ధాశ్రమానికి ఎమైనా ఇస్తారా?" అడిగారు కార్యకర్తలు
" మా అత్తగారినిస్తాను. తీసుకోండి!" ఓ వితరణశీలి


telugu hasyasaram blog

Air hostess

Meanwhile on Air India:
Air hostess: "Sir, would you like to have lunch?"
Passenger: "What are my choices?"
Air hostess: "Yes or No."

వాళ్లు మీ పాఠం వినడం లేదన్నమాట

"పిడుగు" క్లాస్ రూమ్ లో నిద్దర పోతున్నాడు!!
"ఎయ్!...పిడుగూ, నేను పాఠం చెబుతోంటే నిద్దర పోవటానికి సిగ్గు లెదూ??!!" అడిగింది టీచర్ "వీణావాణి"!
"మీరు పాఠం చెబుతుంటే ,కమ్మగా నిద్దర వస్తోంది టీచర్!!" అన్నాడు "పిడుగు"!
"ఆ(హా( !! మరి మిగతావాళ్ళకి రావడం లేదేం నిద్ర?!" అంది టీచర్ "వీణావాణి"!
"ఓహ్! అదా!!...అంటె వాళ్లు మీ పాఠం వినడం లేదన్నమాట !!' అన్నాడు "పిడుగు"!!

Adrustavantudivi


Raajadhani


agave

ఇద్దరు ఒకలానే లేపితే ఇదే సమస్య వస్తుంది .. 

 - Bapu

Saturday, July 19, 2014

అంతరిక్షం లో మొదట కాలు మోపినది ఎవరు!?

"ఒరేయ్! పిడుగూ!!... అంతరిక్షం లో మొదట కాలు మోపినది ఎవరు!?" అడిగారు "ఆకాష్- వాణి" టీచర్ !
"ఉ( ...నీల్ ఆర్మస్ట్రాంగ్!! " అన్నాడు "పిడుగు!"
"సహభాష్ !! మరి, రెండో సారి ఎవరు మోపారు?!! అని మళ్లీ అడిగింది "ఆకాష్- వాణి" టీచర్ !
"రెండో సారి కూడా ఆయనే తన రెండో కాలు మోపాడు...నీల్ ఆర్మస్త్రాంగ్ కుంటివాడు కాదు గా!! అన్నాడు "పిడుగు"!!

Rv Prabhu.

చదువు కొనివ్వండీ

"అమ్మాయి నచ్చింది....పెళ్లి ఎప్పుడు చేద్దాం?!" ...."అహంకార వల్లి"
"అదే ...అమ్మాయి ఇంకా చదువు కుంటోంది,మరి, అని ఆలోచిస్తున్నాము!!"..."సౌమ్య కుమారి"!!
"చదువు కొనివ్వండీ!!...
..మా అబ్బాయి ఏమయినా చిన్న పిల్ల వాడా, ఆమ్మాయి పుస్తకాలు చిమ్పుతాడని భయ పడటానికి!??" "అహంకార వల్లి"

ఒరేయ్! పిడుగూ

""ఒరేయ్! పిడుగూ !! ...దొరికావు రా......దొంగా ...ఎరా నిన్న పరీక్షలో , నువ్వు రాసిన ఆన్సరూ, నీ పక్కవాడు రాసిన ఆన్సరూ...ఒకే లాగా వున్నాయి..కాపీ కొట్టడానికి సిగ్గుగా లేదు ....చెప్పు నీ సంజాయిషీ ఎమిటి??!" అడిగాడు కోపంగా వూగిపొతూ "నరసయ్య మాస్టారు!! "
 

చాలా. కూల్ గా లేచి నిలబడ్డాడు "పిడుగు"!
"మీకు నిజ్హం గా తెలియదా మాస్టారూ !!?" అన్నాడు 


"తెలిస్తే నిన్నెందుకు అడుగుతానొయ్ ..వెధవ కబుర్లాపి , అసలు సంగతి చెప్పు!!" అన్నాడు "నరసయ్య మాస్టారు!! "!!


"ఏమ్ముంది సార్!! మీరు మాకిచ్చిన ప్రశ్నలు కూడా ఒకే లాగా వున్నాయి మరి!!" అన్నాడు "పిడుగు"!!
- Rv Prabhu