Monday, July 21, 2014

agave

ఇద్దరు ఒకలానే లేపితే ఇదే సమస్య వస్తుంది .. 

 - Bapu

Saturday, July 19, 2014

అంతరిక్షం లో మొదట కాలు మోపినది ఎవరు!?

"ఒరేయ్! పిడుగూ!!... అంతరిక్షం లో మొదట కాలు మోపినది ఎవరు!?" అడిగారు "ఆకాష్- వాణి" టీచర్ !
"ఉ( ...నీల్ ఆర్మస్ట్రాంగ్!! " అన్నాడు "పిడుగు!"
"సహభాష్ !! మరి, రెండో సారి ఎవరు మోపారు?!! అని మళ్లీ అడిగింది "ఆకాష్- వాణి" టీచర్ !
"రెండో సారి కూడా ఆయనే తన రెండో కాలు మోపాడు...నీల్ ఆర్మస్త్రాంగ్ కుంటివాడు కాదు గా!! అన్నాడు "పిడుగు"!!

Rv Prabhu.

చదువు కొనివ్వండీ

"అమ్మాయి నచ్చింది....పెళ్లి ఎప్పుడు చేద్దాం?!" ...."అహంకార వల్లి"
"అదే ...అమ్మాయి ఇంకా చదువు కుంటోంది,మరి, అని ఆలోచిస్తున్నాము!!"..."సౌమ్య కుమారి"!!
"చదువు కొనివ్వండీ!!...
..మా అబ్బాయి ఏమయినా చిన్న పిల్ల వాడా, ఆమ్మాయి పుస్తకాలు చిమ్పుతాడని భయ పడటానికి!??" "అహంకార వల్లి"

ఒరేయ్! పిడుగూ

""ఒరేయ్! పిడుగూ !! ...దొరికావు రా......దొంగా ...ఎరా నిన్న పరీక్షలో , నువ్వు రాసిన ఆన్సరూ, నీ పక్కవాడు రాసిన ఆన్సరూ...ఒకే లాగా వున్నాయి..కాపీ కొట్టడానికి సిగ్గుగా లేదు ....చెప్పు నీ సంజాయిషీ ఎమిటి??!" అడిగాడు కోపంగా వూగిపొతూ "నరసయ్య మాస్టారు!! "
 

చాలా. కూల్ గా లేచి నిలబడ్డాడు "పిడుగు"!
"మీకు నిజ్హం గా తెలియదా మాస్టారూ !!?" అన్నాడు 


"తెలిస్తే నిన్నెందుకు అడుగుతానొయ్ ..వెధవ కబుర్లాపి , అసలు సంగతి చెప్పు!!" అన్నాడు "నరసయ్య మాస్టారు!! "!!


"ఏమ్ముంది సార్!! మీరు మాకిచ్చిన ప్రశ్నలు కూడా ఒకే లాగా వున్నాయి మరి!!" అన్నాడు "పిడుగు"!!
- Rv Prabhu